Bellamkonda Srinivas: నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా 'రాక్షసుడు': హీరో బెల్లంకొండ శ్రీనివాస్

  • తమిళ కథలో పెద్దగా మార్పులు చేయలేదు
  • నేను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను 
  •  నా కెరియర్లో ప్రత్యేక చిత్రమవుతుంది

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందిన 'రాక్షసుడు' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ 'రాచ్చసన్'కి రీమేక్ గా నిర్మితమైన ఈ సినిమాకి రమేశ్ వర్మ దర్శకత్వం వహించాడు.

తాజాగా ఈ సినిమాను గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ .. "ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను. తమిళంలో ఒరిజినల్ సినిమా చూశాను .. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ తరువాతనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. తమిళంలోని కథకు పెద్దగా మార్పులు చేయలేదు. కాకపోతే మరింత ఆసక్తికరంగా చెప్పడానికి మా వంతు ప్రయత్నం చేశాము. ఈ సినిమాలో కథే హీరో .. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా .. ఉద్వేగ భరితంగా సాగుతుంది. నా కెరియర్లో ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News