Bigg Boss-3: అన్ని రికార్డులు బద్దలు కొట్టిన బిగ్ బాస్-3

  • ఇటీవలే ప్రారంభమైన బిగ్ బాస్ మూడో సీజన్
  • 17.92 టీఆర్పీ నమోదు చేసిన తొలి ఎపిసోడ్
  • నాగార్జున సత్తాకు నిదర్శనం అంటూ ట్వీట్

తెలుగు బుల్లితెర రంగంలో తిరుగులేని రియాల్టీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ అద్భుతమైన రికార్డు సొంతం చేసుకుంది. టీఆర్పీ రేటింగ్స్ పరంగా బిగ్ బాస్-3 అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. మరే ఇతర కార్యక్రమానికి సాధ్యం కాని రీతిలో అదిరిపోయే రేంజ్ లో బిగ్ బాస్-3 తొలి ఎపిసోడ్ 17.92 టీఆర్పీ నమోదు చేసింది.

 టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం విశేష ప్రజాదరణ పొందుతోందని  తాజా రేటింగ్ చెబుతోంది. దీనిపై ప్రముఖ టాలీవుడ్ పీఆర్వో బీఏ రాజు ట్వీట్ చేశారు. నాగార్జునను కింగ్ అని ఎందుకు పిలుస్తారో చెప్పడానికి ఈ రికార్డు స్థాయుల టీఆర్పీనే నిదర్శనం అని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్-1 తొలి ఎపిసోడ్ అత్యధికంగా 16.18 టీఆర్పీ సాధించగా, నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్-2 తొలి ఎపిసోడ్ 15.05 రేటింగ్ నమోదు చేసింది.

More Telugu News