Hyderabad: కూకట్ పల్లిలో చిరుత సంచారం ఉత్తిదే... తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఇద్దరిపై కేసు!

  • మూడు రోజులుగా ప్రజల్లో ఆందోళన
  • చిరుత ఆనవాళ్ల కోసం గాలించిన అధికారులు
  • సంచారమే లేదని తేల్చిన అటవీ శాఖ

గడచిన మూడు రోజులుగా ఎప్పుడు ఎటువైపు నుంచి చిరుతపులి దాడి చేస్తుందోనన్న భయాందోళనలతో ఉన్న హైదరాబాద్, కూకట్ పల్లి, ప్రగతినగర్ వాసులు ఏ మాత్రం భయపడక్కర్లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నదన్న వార్తలు పూర్తిగా అవాస్తమని తేల్చారు. నిన్నటి నుంచి అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఈ ప్రాంతంలో అణువణువూ పరిశీలించి, చిరుతపులి తిరిగిన జాడలు లేవని స్పష్టం చేశారు.

 చిరుత తిరిగిందన్నట్టు చెబుతున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, పాదముద్రలు తదితరాలను అన్వేషించారు. చిరుత ఈ ప్రాంతంలో తిరగలేదని తేల్చారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఓ స్కూల్ వాచ్ మన్ నర్సయ్య, డ్రైవర్ రాజులపై కేసులు నమోదు చేశామని, వారు ఈ వీడియోలను ఎలా తయారు చేశారు? ఎందుకు వాటిని ప్రచారం చేశారన్న విషయాలపై విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News