Pawan Kalyan: బీజేపీతో చేతులు కలపనున్న పవన్ కల్యాణ్?

  • గత రెండు రోజులుగా నేతలతో పవన్ సమావేశం
  • బీజేపీలో జనసేన విలీనంపై చర్చ
  • విలీనం కంటే సఖ్యతగా ఉండడమే మంచిదన్న నేతలు

బీజేపీతో కలిసి వెళ్తే తప్ప పార్టీని బతికించుకోలేమని నిర్ణయానికి వచ్చిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై గత రెండు రోజులుగా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్న పవన్.. బీజేపీతో కలిసి వెళ్లడంపై చర్చించినట్టు తెలుస్తోంది.

కీలక నేతల వద్ద ఆయనీ విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డిని ఢీకొట్టేందుకు బీజేపీతో చేతులు కలపడం తప్ప మరో మార్గం లేదని జనసేన నేతలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీని బీజేపీలో విలీనం చేయాలని తానా సభల్లో పవన్‌ను కలిసిన బీజేపీ నేత రాంమాధవ్ కోరినట్టు వార్తలొచ్చాయి.  

బీజేపీలో పార్టీని విలీనం చేయడం కంటే ఆ పార్టీతో కలిసి పనిచేస్తేనే బాగుంటుందని కొందరు నేతలు పవన్‌కు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో జనసేనకు బీజేపీ అంత ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని, కాబట్టి ఆ పార్టీతో సఖ్యతగా ఉండడమే మేలని మరికొందరు నాయకులు పవన్‌కు సూచించినట్టు సమాచారం.

More Telugu News