hamza bin laden: బిన్‌లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్‌ను హతమార్చిన అమెరికా

  • అల్ ఖైదాకు చీఫ్‌గా ఉన్న హమ్జా 
  • రెండేళ్లుగా గాలిస్తున్న అమెరికా
  • హమ్జా మృతిపై మాట్లాడబోనన్న అమెరికా అధ్యక్షుడు

ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ బిన్‌లాడెన్ కుమారుడు హామ్జా బిన్ లాడెన్ కోసం రెండేళ్లుగా గాలిస్తున్న అమెరికా ఎట్టకేలకు విజయం సాధించింది. అతడిని హతమార్చినట్టు అమెరికా పత్రికలు ప్రకటించాయి. తండ్రి మృతి తర్వాత అల్ ఖైదా‌కు వారసుడిగా ఉన్న హమ్జా మృతికి సంబంధించి తమ వద్ద పక్కా సమాచారం ఉందని ఎన్‌బీసీ వార్తా సంస్థ వెల్లడించింది. హమ్జా మృతిని అమెరికా అధికారులు కూడా ధ్రువీకరించినట్టు తెలిపింది.  

2017లో హమ్జా బిన్ లాడెన్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన అమెరికా అతడిపై మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది. కాగా, అమెరికా మీడియా మొత్తం హమ్జా మృతిపై కోడై కూస్తుండగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ విషయంలో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేనని చెప్పడం గమనార్హం.

More Telugu News