Bhadradri Kothagudem District: లింగన్న దళాన్ని చుట్టుముట్టిన పోలీసులు.. ఎదురుకాల్పుల్లో లింగన్న మృతి

  • మీడియా, ప్రజలను అనుమతించని పోలీసులు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు
  • పోలీసులపై రాళ్ల దాడి
  • ఒక కానిస్టేబుల్‌కు గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని పందిగుట్టపై లింగన్న దళం మూడు రోజులుగా విశ్రాంతి తీసుకుంటోందన్న పక్కా సమాచారంతో పోలీసులు దళాన్ని చుట్టుముట్టారు. దీంతో ఇరువురి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లింగన్న మృతి చెందగా, మరో ఐదుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లింగన్న న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. ఈ కాల్పుల అనంతరం రెండు గంటల పాటు ప్రజలు, మీడియాను పోలీసులు అనుమతించలేదు. ప్రజలు గొడవ చేయడంతో అనుమతించారు కానీ, వారు వెళ్లేలోపు గుట్ట వెనుక వైపుగా లింగన్న మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో వారిపై ప్రజలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌కు గాయాలవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  

More Telugu News