Nithin: నితిన్ .. కీర్తి సురేశ్ అదరగొట్టేస్తున్నారట!

  • వెంకీ అట్లూరి నుంచి 'రంగ్ దే'
  • నితిన్ జోడీగా కీర్తి సురేశ్ 
  • వచ్చే వేసవి కానుకగా రిలీజ్ 

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా 'రంగ్ దే' రూపొందుతోంది. ఈ సినిమాలో నితిన్ జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చాలా వేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.

పీసీ శ్రీరామ్ ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. నితిన్ .. కీర్తి సురేశ్ ఇద్దరూ కూడా పోటీపడి నటిస్తున్నారనీ, వాళ్లిద్దరి నటన గుర్తుండిపోయేలా ఉంటుందంటూ ఆయన ఒక ట్వీట్ చేశాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా తమ జీవితాలను మరింత రంగులమయం చేయనుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం వున్నట్టుగా తెలుస్తోంది.

More Telugu News