Pawan Kalyan: పవన్ కల్యాణ్ అంత కష్టపడడం ఎందుకని మా ఫ్యామిలీ భావించింది: నాగబాబు

  • జనసేన పార్టీ స్థాపన తమ కుటుంబానికి ఇష్టంలేదన్న మెగాబ్రదర్
  • పవన్ సిద్ధాంతాలు అర్థంచేసుకోవడానికి రెండున్నరేళ్లు పట్టిందని వెల్లడి
  • తాను పార్టీలో అందరికంటే జూనియర్ నంటూ నాగబాబు వ్యాఖ్యలు

జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని మెగా బ్రదర్ నాగబాబు చెప్పారు.ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, ఐదేళ్ల కిందట తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన సమయంలో తమ కుటుంబం మనోభావాలు ఎలా ఉన్నాయో వెల్లడించారు.

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టడం మెగా ఫ్యామిలీకి ఎంతమాత్రం ఇష్టంలేదని తెలిపారు. అంతకుముందు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఎంత నష్టపోయాడో తెలిసి కూడా పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని తాము స్వాగతించలేకపోయామని వివరించారు. పవన్ అంత కష్టపడడం ఎందుకున్న భావన తమలో ఉండేదని చెప్పుకొచ్చారు.

కానీ, పార్టీ స్థాపించిన తర్వాత పవన్ ఆదర్శాలు, సిద్ధాంతాలు తెలిసి తాను కూడా జనసేనలోకి వచ్చినట్టు నాగబాబు వెల్లడించారు. తాను పార్టీలో అందరికంటే జూనియర్ నని, పవన్ పార్టీ పెట్టాక సిద్ధాంతాలు, భావజాలాన్ని అర్థంచేసుకోవడానికి రెండున్నరేళ్లు పట్టిందన్నారు.

జనసేన ఆవిర్భావ సభ జరిగిన రోజున తాను గోవాలో షూటింగ్ లో ఉన్నానని, అయితే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి పవన్ ప్రసంగాన్ని రెండు గంటల సేపు విన్నానని నాగబాబు తెలిపారు. ఆ ప్రసంగం విన్నతర్వాతే పవన్ కల్యాణ్ అంటే ఏంటో అర్థమైందని చెప్పారు.

More Telugu News