Srikakulam: పాక్ జైళ్లలో వున్న మన జాలర్లను విడిపించండి: కేంద్ర విదేశాంగ మంత్రిని కోరిన వైసీపీ ఎంపీలు

  • చేపల వేటకు వెళ్లి పాక్ జలాల్లోకి ప్రవేశించిన జాలర్లు
  • అదుపులోకి తీసుకున్న పాక్ గస్తీ బృందం
  • 21 మంది జాలర్లను విడిపించాలని కోరిన వైసీపీ ఎంపీలు

పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులను సత్వరమే విడిపించే ప్రయత్నాలు చేయాలని వైసీపీ ఎంపీలు నేడు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ను కోరారు. ఢిల్లీలో వీరు మంత్రిని కలసి ఈ మేరకు విజ్ఞాపన అందజేశారు. పాక్ గస్తీ దళాలకు చిక్కిన జాలర్లతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు అనుమతి ఇప్పించాలని కూడా కోరారు.

శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు చెందిన జాలర్లు కొందరు గుజరాత్‌లోని వారావల్ ప్రాంతానికి బతుకుదెరువు కోసం వెళ్లారు. ఈ నేపథ్యంలో చేపల వేటకని, నాలుగు మెక్‌నైజ్డ్ బోట్లలో పయనమై అరేబియా సముద్రంలోకి వెళ్లారు. వీటిలో మూడు బోట్లలో వున్న 21 మంది చేపల్ని వేటాడుతూ, పొరపాటున భారత సరిహద్దు దాటి పాక్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి గస్తీ దళాలకు చిక్కాయి.  

More Telugu News