Hema: కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ ఎన్నికలకు ముందే చెప్పారు: హేమ

  • బిగ్ బాస్-3 నుంచి మొదటివారమే ఎలిమినేట్ అయిన సినీ నటి హేమ
  • హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు
  • జగన్ పార్టీలో జాయిన్ కాకపోయినా సపోర్ట్ చేశానంటూ వెల్లడి

బిగ్ బాస్-3 రియాల్టీ షోలో తొలివారమే ఎలిమినేట్ అయిన సినీ నటి హేమ మీడియా సమావేశం నిర్వహించారు. తన సత్తా ఎంతో తెలుసుకునేందుకే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టానని వివరించారు. ఈ సందర్భంగా ఆమె రాజకీయ అంశాలు కూడా స్పృశించారు. జగన్ పార్టీ అంటే తనకు ఇష్టమని, అయితే ఆ పార్టీలో జాయిన్ కాలేదు కానీ సపోర్ట్ చేశానని చెప్పారు. రాజకీయాల్లో చేరి సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లాలని అనుకోవడంలేదని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో తాను చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని హేమ తెలిపారు.

ఇటీవల చర్చనీయాంశంగా మారిన కాపు రిజర్వేషన్ల అంశంపైనా హేమ స్పందించారు. కాపు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ ఎన్నికలకు ముందే చెప్పారని పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్ మాట మార్చడంలేదని, స్పష్టతతో ఉన్నారని వివరించారు.

More Telugu News