Triple Talak: ట్రిపుల్ తలాక్ బిల్లుకు వైసీపీ వ్యతిరేకం: రాజ్యసభలో విజయసాయిరెడ్డి

  • ట్రిపుల్ తలాక్ ను తీవ్రమైన నేరంగా పరిగణించరాదు
  • బిల్లు చట్ట రూపం దాల్చితే అమాయకులు జైలుకు వెళ్తారు
  • బిల్లును పున:సమీక్షించండి

బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు తాము వ్యతిరేకమని వైసీపీ స్పష్టం చేసింది. బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, బిల్లుపై తమకు ఆరు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ట్రిపుల్ తలాక్ ను తీవ్రమైన నేరంగా పరిగణించరాదని చెప్పారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ఎంతో మంది అమాయకులు జైలుపాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసుతో భర్తను జైలుకు పంపితే... భార్యకు భరణం ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఈ బిల్లుకు తాము వ్యతిరేకమని చెప్పారు. బిల్లును పున:సమీక్షించాలని కోరారు.

More Telugu News