Baba Bhakar: ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొస్తే మా నాన్న అవతలకి పొమ్మన్నాడు: బాబా భాస్కర్

  • ప్రేమించిన అమ్మాయిని పెళ్లికి ఒప్పించాను
  •  ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు
  •  గుళ్లో ఆమె మెళ్లో తాళి కట్టేశానన్న బాబా భాస్కర్

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ మాట్లాడుతూ, తన లవ్ మ్యారేజ్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించాడు. "నేను డాన్సర్ ను .. నేను ప్రేమించిన అమ్మాయి కూడా డాన్సరే. ఆమెను పెళ్లికి ఒప్పించడానికి నేను చాలా కష్టాలు పడ్డాను.

మొత్తానికి ఒక రోజున పెళ్లికి ఒప్పుకుంటే 'బిర్లా మందిర్' కి తీసుకొచ్చాను. అక్కడి కొట్లో దారం .. పసుపు కొమ్ము కొని, ఆ అమ్మాయి మెళ్లో కట్టేశాను. తనవాళ్లు లేకుండా పెళ్లి చేసుకుంటున్నందుకు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకెళ్లాను. 'అవతలికి పోరా' అన్నాడు మా నాన్న. దాంతో ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లి వేరు కాపురం పెట్టాను. ఆ తరువాత మా వాళ్లు .. ఆ అమ్మాయి పేరెంట్స్ మనసు మార్చుకుని వచ్చారు" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News