Chris Gayle: క్రిస్ గేల్ దుమారం... 54 బంతుల్లో 122 పరుగులు!

  • యూనివర్శల్‌ బాస్‌ గా పేరు తెచ్చుకున్న క్రిస్‌ గేల్‌
  • వాంకోవర్ నైట్స్ తరఫున ఆడిన గేల్
  • మాంట్రియల్ బౌలర్లకు చుక్కలు

క్రికెట్ లో అందునా పొట్టి ఫార్మాట్ లో యూనివర్శల్‌ బాస్‌ గా పేరు తెచ్చుకున్న క్రిస్‌ గేల్‌ మరోసారి తన మెరుపులు చూపించాడు. ప్రస్తుతం గ్లోబల్‌ టీ-20 కెనడాలో వాంకోవర్ నైట్స్‌ తరఫున ఆడుతున్న గేల్‌, నిన్న జరిగిన మ్యాచ్ లో కేవలం 54 బంతుల్లో 122 పరుగులు సాధించాడు. ఇందులో 12 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. మాంట్రియల్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, ఆకాశమే హద్దుగా గేల్ సాగిపోయాడు.

తొలి వికెట్‌ కు విస్సేతో కలిసి 63 పరుగులు, రెండో వికెట్ కు చెడ్విక్‌ వాల్టన్‌ తో కలిసి 139 పరుగుల భాగస్వామ్యాన్ని గేల్ నెలకొల్పాడు. దీంతో వాంకోవర్ జట్టు 20 ఓవర్లలో 276 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. టీ-20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. గత సంవత్సరం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గనిస్థాన్ జట్టు 278 పరుగులు చేయగా, అదే ప్రస్తుతానికి క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు. అయితే, గేల్ గర్జించిన తరువాత, వరుణుడు ఉరుములు, మెరుపులతో విరుచుకుపడటంతో, మ్యాచ్ ఫలితం తేలకుండా పోయింది.

More Telugu News