Amaravati: అమరావతికి వెళ్లే మార్గాలను జల్లెడ పడుతున్న పోలీసులు!

  • చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్
  • వెలగపూడికి వెళ్లే దారుల దిగ్బంధం
  • ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో, ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని, ముఖ్యంగా వెలగపూడికి వెళ్లే అన్ని దారులను పోలీసులు దిగ్బంధం చేశారు. అసెంబ్లీకి వెళ్లే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను సైతం వదలడం లేదు. అనుమానం వస్తే, వారి గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు.

తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, తుళ్లూరు, మందడం, మంగళగిరి తదితర ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన అధికారులు, ఆయా మార్గాల్లోకి వచ్చే వాహనాల్లో ఎవరు ప్రయాణిస్తున్నారన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని సమీపంలోని స్టేషన్లకు తరలించారు.

తాడేపల్లి సమీపంలో 12 మందిని, గుంటూరు శివార్లలో 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయం వైపు ఒక్క వాహనం కూడా వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. బస్సులను సైతం మందడం కూడలి వరకే అనుమతిస్తున్నారు. అక్కడి నుంచి మరికొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సిన వృద్ధులు, వికలాంగుల కోసం పోలీసులే వాహనాలను సమకూరుస్తున్నారు.

More Telugu News