నేటి సాయంత్రం గవర్నర్‌తో జగన్ భేటీ

30-07-2019 Tue 07:54
  • సాయంత్రం నాలుగు గంటలకు భేటీ
  • గంటపాటు కొనసాగనున్న సమావేశం
  • తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్‌ను కలవనున్న జగన్ గంటపాటు ఆయనతో సమావేశం కానున్నారు. తాజా సమస్యలతోపాటు రాష్ట్ర విభజన సమస్యలు, అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు తదితర వాటిని గవర్నర్‌కు జగన్ వివరించనున్నట్టు తెలుస్తోంది.