ఏపీలోని సంగం డెయిరీలో చోరి.. రూ.44 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

29-07-2019 Mon 21:23
  • వడ్లమూడిలో ఉన్న సంగం డెయిరీ 
  • లాకర్ లోని నగదు అపహరణ
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఏపీలోని సంగం డెయిరీలో చోరీ జరిగింది. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ ప్రధాన కార్యాలయంలో నిన్న రాత్రి రూ.44 లక్షలను దుండగులు దోచుకెళ్లారు. సంగం డెయిర్ చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆఫీసు పై గదిలో ఉన్న లాకర్ లోని నగదును దుండగులు అపహరించుకుపోయారు. వరుసగా శని, ఆదివారాలు బ్యాంకు సెలవు దినాలు కావడంతో జమ చేయాల్సిన నగదు అంతా డెయిరీలోనే ఉంచాల్సి వచ్చింది. ఈరోజు సిబ్బంది విధుల్లోకి వచ్చాక నగదు ఉంచిన లాకర్ వద్దకు వెళ్లగా, అది పగలగొట్టి ఉండటం గమనించారు. దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. డెయిరీ సిబ్బందిని ప్రశ్నించి, వారి వేలి ముద్రలను సేకరించినట్టు సమాచారం.