Andhra Pradesh: ప్రజలు తమ ఇళ్లముందు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

  • 'స్పందన'కు 10 వేల ఫిర్యాదులు వచ్చాయన్న డీజీపీ
  • 97 శాతానికి పైగా పరిష్కరించామంటూ వెల్లడి
  • ప్రతి చిన్న వివాదాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని హితవు

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై స్పందించారు. 'స్పందన'కు నెలరోజుల్లో 10 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 97 శాతం పైగా ఫిర్యాదులను పరిష్కరించామని వెల్లడించారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా సివిల్ వివాదాలు, మహిళలపై వేధింపుల ఘటనలే ఎక్కువగా ఉన్నాయని సవాంగ్ వివరించారు. మండపేట బాలుడు కేసులో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లముందు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. ప్రతి చిన్న వివాదాన్ని రాజకీయ ఘర్షణలుగా చిత్రీకరించవద్దని అన్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని, రాజకీయ దాడులు కూడా తగ్గాయని డీజీపీ వివరించారు.

More Telugu News