Maoist: మావోయిస్టు వారోత్సవాల కారణంగా పలు బస్సు సర్వీసుల రద్దు

  • వాజేడు, వెంకటాపురం, చర్లకు సాయంత్రం బస్సు సర్వీసులు రద్దు
  • ఆగస్టు 3 సాయంత్రం 4.30 గంటల తర్వాత నుంచి రద్దు
  • భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ వెల్లడి

మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల కారణంగా పలు బస్సు సర్వీసులను తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) రద్దు చేసింది. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, కొత్తగూడెం జిల్లాలోని చర్లకు సాయంత్రం సర్వీసులను నిలిపివేస్తున్నట్టు భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు. ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 4.30 గంటల తర్వాత నుంచి ఆయా బస్సు సర్వీసులను రద్దు చేసినట్టు చెప్పారు.

కాగా, ఈ నెల 28 నుంచి ప్రారంభమైన మావోయిస్టుల వారోత్సవాలు ఆగస్టు 3 వరకు జరగనున్నాయి. నక్సల్ బరి ఉద్యమ సృష్టికర్త చారు మజుందార్ 1972 జులై 28న జైల్లో అమరుడయ్యారు. అప్పటి నుంచి ఆయన వర్ధంతిని అమరవీరుల వారోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలను 1980లో తొలిసారిగా పీపుల్స్ వార్ పార్టీ జరిపింది.

More Telugu News