Priyanka Arul Mohan: అఖిల్ జోడీగా 'గ్యాంగ్ లీడర్' భామ?

  • 'బొమ్మరిల్లు' భాస్కర్ తో అఖిల్ 
  • కథానాయిక కోసం పలువురి పేర్ల పరిశీలన
  •  ప్రియాంకా అరుళ్ మోహన్ కి ఛాన్స్   

అఖిల్ కథానాయకుడిగా 'బొమ్మరిల్లు' భాస్కర్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. అప్పటి నుంచి ఈ సినిమా కోసం కథానాయికగా ఎవరిని తీసుకోనున్నారనే ఆసక్తిని అభిమానులు కనబరుస్తూ వస్తున్నారు.

తాజాగా అఖిల్ జోడీగా ఒక అమ్మాయిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆ అమ్మాయి ఎవరో కాదు .. ఆల్రెడీ నాని సినిమా 'గ్యాంగ్ లీడర్'లో చేస్తోన్న 'ప్రియాంకా అరుళ్ మోహన్'. ఆకర్షణీయమైన రూపంతో ఇప్పుడిప్పుడే తమిళ .. కన్నడ ప్రేక్షకుల హృదయాలను ఈ సుందరి కొల్లగొడుతోంది. 'గ్యాంగ్ లీడర్' విడుదల తరువాత ఈ అమ్మాయి బిజీ కావడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తూ ఉండటంతో ఆమెనే అఖిల్ జోడీగా తీసుకున్నారనేది తాజా సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది. 

More Telugu News