Robin Singh: రవిశాస్త్రిపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాబిన్ సింగ్

  • శాస్త్రి కోచింగ్ లో వరుసగా రెండు ప్రపంచకప్ లలో ఓడిపోయాం
  • టీ20 ఛాంపియన్ షిప్ లో కూడా పరాభవం ఎదురైంది
  • కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది

ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ లో టీమిండియా ఓటమిపాలైన తర్వాత హెడ్ కోచ్ రవిశాస్త్రిపై ఓ రేంజ్ లో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రాబిన్ సింగ్ కూడా రవిశాస్త్రిపై విమర్శలు గుప్పించారు. రవిశాస్త్రి కోచింగ్ లో టీమిండియా వరుసగా రెండు ప్రపంచకప్ లలో సెమీఫైనల్స్ లో ఓడిపోయిందని అన్నారు. టీ20 ఛాంపియన్ షిప్ లో కూడా పరాభవమే ఎదురైందని మండిపడ్డారు. 2023 ప్రపంచకప్ పై ఇక నుంచి మనం దృష్టి సారించాల్సి ఉందని... ఈ క్రమంలో కొన్ని మార్పులు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పారు. మరోవైపు హెడ్ కోచ్ పోస్ట్ కోసం రాబిన్ సింగ్ కూడా దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

హెడ్హో కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియో థెరపిస్ట్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ పదవుల కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత కోచింగ్ స్టాఫ్ కు మాత్రం రిక్రూట్ మెంట్ ప్రాసెస్ లో ఆటోమేటిక్ ఎంట్రీ ఉంటుందని బీసీసీఐ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 30వ తేదీ చివరి రోజు కావడం గమనార్హం.

More Telugu News