Artist: కొమ్మినేని శ్రీనివాసే ఆ ఛానెల్ కు గజ్జి: సినీ నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు

  • నా మీద ఉంది ఓ చెత్త కేసు
  • మీ ఓనర్ పై 36 కేసులు .. జైల్లో ఉండి వచ్చాడు
  • సాక్షి ఛానెల్ ను, కొమ్మినేని శ్రీనివాస్ ను సెట్ చేయాలి

సాక్షి ఛానెల్ పైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపైనా సినీ నటుడు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఏబీఎన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నా మీద వున్నది ఓ చెత్త కేసు. మరి, మీ ఓనర్ మీద 36 కేసులు ఉన్నాయి. పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చాడు ఆయన. నేను ఏ రోజూ ఆయన్ని అవినీతిపరుడనలేదు. ఆరోపణలు ప్రూవ్ కాలేదు. ఎందుకనాలి?

ముందు, సాక్షి ఛానెల్ ను, కొమ్మినేని శ్రీనివాస్ ను సెట్ చేయాలి. ఆ కొమ్మినేని శ్రీనివాసే ఆ ఛానెల్ కు గజ్జి. వేరే ఇంకెవరూ లేరు. ఐయామ్ సారీ టూ సే దిస్. నా మీద వ్యక్తిగతంగా ఇష్టమొచ్చినట్టు పేలాడు. వ్యక్తిగతమెందుకు? ఎవరి గురించి అయినా మనం నెగెటివ్ గా మాట్లాడుతుంటే, లోపల అవయవాలన్నీ కుళ్లిపోతుంటాయి. అట్లాగే, ఇంకో అతను, జర్నలిస్టు బిళ్ల ఒకటి వేసుకుని కూర్చుని.. కమ్మోళ్లు ఏం పని చేయాలి? రెడ్లు ఏం పని చేయాలి? కమ్మోళ్లకు రాజకీయాలు అవసరం లేదని ఓ సన్నాసి మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి బఫూన్లను టార్గెట్ చేయడం నా పని కాదు’ అంటూ విరుచుకుపడ్డారు.

More Telugu News