Pakistan: పీకల్లోతు నీళ్లలో మునిగి రిపోర్టింగ్ చేసిన పాక్ టీవీ చానల్ ప్రతినిధి

  • పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో వరదలు
  • వరద ప్రభావిత ప్రాంతాలకు తమ రిపోర్టర్ ను పంపిన 'జి టీవీ' చానల్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

కొన్ని సందర్భాల్లో మీడియా చానళ్ల రిపోర్టర్లు సాహసోపేతమైన రీతిలో రిపోర్టింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. వీక్షకులు సైతం పరిస్థితి పట్ల సానుభూతి చెందేలా చేయడం కోసం తాము ఎంతో రిస్క్ తీసుకుంటుంటారు. ఈ పాకిస్థాన్ టీవీ చానల్ రిపోర్టర్ కూడా ఆ కోవలోకే వస్తాడు.

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలో ప్రస్తుతం వరదలు సంభవిస్తున్నాయి. దాంతో అన్ని చానళ్లతో పాటు 'జి టీవీ' చానల్ కూడా తన రిపోర్టర్ అజర్ హుస్సేన్ ను వరద ప్రభావిత ప్రాంతాలకు పంపింది. అయితే ఆ రిపోర్టర్ ప్రజలు ఉన్న చోట కాకుండా బాగా నీళ్లు ప్రవహిస్తున్న ప్రాంతానికి వెళ్లి పీకల్లోతు నీళ్లలో దిగి అక్కడ్నించే రిపోర్టింగ్ చేశాడు. ఓవైపు లైవ్ లో ఉన్న న్యూస్ ప్రజెంటర్ కూడా ఆ రిపోర్టర్ ను కనీసం హెచ్చరించలేదు.

ఆ వరద నీళ్లలో అతడి మెడ, అతడి చేతిలో మైక్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ రిపోర్టర్ తాను నిలుచున్నది వరదనీటిలో అని పట్టించుకోకుండా, తాను చెప్పాల్సింది చెప్పేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియోనే కనిపిస్తోంది.

More Telugu News