Prabhakar: డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో అదుపు తప్పిన వాహనం.. ఒకరి మృతి

  • 10 వాహనాలపైకి దూసుకెళ్లిన వాహనం
  • ప్రభాకర్ అనే హోంగార్డు మృతి
  • పలువురికి గాయాలు

ఓ వాహనం అదపుతప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఓ హోంగార్డు మృతి చెందాడు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో అదుపు తప్పిన వాహనం, ముందున్న దాదాపు 10 వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విధి నిర్వహణలో భాగంగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న ప్రభాకర్ అనే హోంగార్డు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్ ఇటీవలే బదిలీపై బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

More Telugu News