Encounter: 24 గంటల వ్యవధిలో 7 ఎన్ కౌంటర్లు చేసిన యూపీ పోలీసులు!

  • నేరస్థుల అణచివేత దిశగా కీలక అడుగులు
  • రాయ్ బరేలీ, ఘజియాబాద్, మొరాదాబాద్ ప్రాంతాల్లో పేలిన తుపాకులు
  • ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

నేరస్థుల అణచివేత దిశగా కీలక అడుగులు వేసిన యూపీ పోలీసులు, 24 గంటల వ్యవధిలో 7 ఎన్ కౌంటర్లు చేశారు. రాయ్ బరేలీ, ఘజియాబాద్, మొరాదాబాద్ నగరాల్లో ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఎన్ కౌంటర్ల తరువాత ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుండగా, వీరిలో ముగ్గురి తలపై 25 వేల బహుమతి ఉన్నట్టు తెలుస్తోంది. ఘజియాబాద్ లోని కవి నగర్, మోదీ నగర్, విజయ్ నగర్ ప్రాంతాల్లో మూడు ఎన్ కౌంటర్లు జరిగాయి.

హపూర్ ప్రాంతంలో బైక్ పై వెళుతున్న క్రిమినల్స్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఫైరింగ్ జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ దళాల డ్రస్ లో వెళుతున్న పాత నేరస్థులకు గాయాలు అయ్యాయి. నేరస్థులు కూడా కాల్పులు జరుపగా, ఇద్దరు పోలీసులకు గాయాలు అయ్యాయి. మొరాదాబాద్ లో ఇద్దరిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా, ఒకడు తప్పించుకోగా, మరొకడు దొరికిపోయాడు. రాయ్ బరేలీలో పాత నేరగాడి కాలిపై కాల్చిన పోలీసులు, అతను గాయపడ్డ తరువాత అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎదురు కాల్పులు కూడా జరుగగా, ఓ పోలీసుకు గాయాలు అయ్యాయి.

More Telugu News