Andhra Pradesh: పెట్టుబడులపై దృష్టి సారించిన సీఎం జగన్.. భారీ స్థాయిలో పారిశ్రామిక సదస్సుకు ఏర్పాట్లు!

  • సెప్టెంబర్ 9న విజయవాడలో సదస్సు
  • హాజరు కానున్న 40 దేశాల ప్రముఖులు
  • ఏపీలో చేపట్టిన సంస్కరణల్ని వివరించనున్న సీఎం

ఏపీలో నవరత్నాలతో సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కంపెనీలను ఆకర్షించేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 9న ‘ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్’ చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడలో ఈ సదస్సును నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సదస్సుకు 40 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు హాజరు కానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో తాము చేపడుతున్న విద్యుత్ సంస్కరణలు, జ్యుడీషియల్ కమిషన్, పారిశ్రామిక రాయితీలు, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ విదేశీ ప్రతినిధులకు వివరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ సదస్సుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే మొదలుపెట్టారు. అయితే విజయవాడలో ఈ సదస్సును ఎక్కడ నిర్వహిస్తారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

More Telugu News