Whats app: మీరు వాట్స్ యాప్ వాడుతారా?... శుభవార్త!

  • ఫేస్ బుక్ అధీనంలో ఉన్న వాట్స్ యాప్
  • త్వరలోనే డెస్క్ టాప్ వర్షన్
  • ఫోన్ తో పీసీని అనుసంధానం చేయకుండానే వాడుకునే అవకాశం

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అధీనంలో ఉన్న వాట్స్ యాప్, తన కస్టమర్లకు శుభవార్త చెప్పనుంది. అతి త్వరలో వాట్స్ యాప్ డెస్క్‌ టాప్ వర్షన్‌ ను ప్రవేశపెట్టనున్నట్టు ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వాట్స్ యాప్ ను కంప్యూటర్ పై వాడాలంటే, స్మార్ట్ ఫోన్ ను, కంప్యూటర్ ను అనుసంధానం చేయాలన్న సంగతి తెలిసిందే. డెస్క్ టాప్ వర్షన్ అందుబాటులోకి వస్తే ఫోన్‌ తో పీసీని అనుసంధానం చేసుకునే బాధ తప్పుతుంది.

కాగా, 2015లో వాట్స్ యాప్ వెబ్ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, డెస్క్‌ టాప్‌ పై వాట్స్ యాప్ ను వాడుకోవాలంటే, మొబైల్ ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. ఇక ఆ సమస్యను తీర్చేలా నేరుగా కంప్యూటర్ లో వాట్స్ యాప్ పనిచేసేలా 'యూనివర్సల్ విండోస్ ప్లాట్‌ ఫామ్' యాప్ ను సంస్థ సిద్ధం చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే, ఫోన్ ఆఫ్ లో ఉన్నా, వాట్స్ యాప్ ను వాడుకునే సౌలభ్యం దగ్గరవుతుంది. ఇదే సమయంలో ఇక ఒకే ఎకౌంట్ పై పలు డివైజ్ లలో ఉపయోగించుకోవచ్చు.

More Telugu News