Nara Lokesh: జగన్ గారూ, మీ పాలనా దౌర్భాగ్యం రాష్ట్రాన్ని ఎలా పట్టిపీడిస్తుందో చూడండి: నారా లోకేశ్

  • తహసీల్దార్ పై వైసీపీ నేత వీరంగం
  • అడ్డుచెప్పిన మహిళా అధికారిపైనా చిందులు
  • వీడియో ట్వీట్ చేసిన టీడీపీ యువనేత

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ జగన్ గారూ మీ పాలనా దౌర్భాగ్యం రాష్ట్రాన్ని ఎలా పట్టిపీడిస్తుందో చూడండి అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. తాను సిఫారసు చేసినవారికే రేషన్ డీలర్ షిప్ ఇవ్వాలంటూ ఓ వైసీపీ నేత తహసీల్దార్ ను ఎలా బెదిరిస్తున్నారో చూడండి అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. తహసీల్దార్ పై దౌర్జన్యానికి దిగడం తప్పు అన్నందుకు ఓ ముస్లిం మహిళా ఆఫీసర్ పైనా దాడికి దిగే ప్రయత్నం చేయబోయాడని, ఆమెను అనరాని మాటలు అన్నాడని లోకేశ్ మండిపడ్డారు.

More Telugu News