Chattisgarh: చత్తీస్ గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో తొలి రెండు ర్యాంకులు కొల్లగొట్టిన దంపతులు

  • చత్తీస్ గఢ్ లో చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ పోస్టులకు రాతపరీక్ష
  • భర్తకు మొదటి ర్యాంకు
  • రెండో ర్యాంకులో నిలిచిన భార్య

ఇటీవల చత్తీస్ గఢ్ రాష్ట్రంలో చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ ఉద్యోగాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో అనుభవ్ సింగ్, విభా సింగ్ అనే భార్యాభర్తలు తొలి రెండు ర్యాంకుల్లో నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. భర్త అనుభవ్ సింగ్ కు మొదటి ర్యాంకు రాగా, విభా సింగ్ కు రెండో ర్యాంకు దక్కింది. ఒకరితో మరొకరు పోటీపడి చదవడం ద్వారా ఈ ర్యాంకులు సాధించారు. ఈ పరీక్షల్లో అనుభవ్ సింగ్ కు 298, విభా సింగ్ కు 283 మార్కులు వచ్చాయి. దీనిగురించి అనుభవ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, తామిద్దరం తొలి రెండు ర్యాంకుల్లో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో పరస్పరం సహకరించుకున్నామని, ఇతర కుటుంబసభ్యులు కూడా తోడ్పాటునందించారని తెలిపారు.

More Telugu News