Vijay Devarakonda: 'డియర్ కామ్రేడ్' చేసినందుకు గర్వంగా వుంది: విజయ్ దేవరకొండ

  • నాలుగు భాషల్లో నిన్న విడుదలైన 'డియర్ కామ్రేడ్'
  • తెలుగులో భారీ ఓపెనింగ్స్ 
  • సక్సెస్ టాక్ పట్ల విజయ్ దేవరకొండ ఆనందం

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా రూపొందిన 'డియర్ కామ్రేడ్' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "నా కెరియర్లో నేను చేసిన ఈ సినిమా మొదటిసారిగా నాలుగు భాషల్లో విడుదలైంది. నాలుగు భాషల్లోని ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ఏడాది పాటు ఈ సినిమా కోసం అందరం కలిసి కష్టపడ్డాం. ఈ సినిమాలో నేను చేసిన 'బాబీ' పాత్రను ఎప్పటికీ మరిచిపోలేను. 'డియర్ కామ్రేడ్' నా కెరియర్లో ప్రత్యేకమైన సినిమా. నాకెంతో ఇష్టమైన ఆల్బమ్ కూడా ఇదే. ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకున్నందుకు నాకు చాలా గర్వంగా వుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News