Khureshi: మాంసం వ్యాపారి ఖురేషీ కేసులో హైదరాబాద్ వ్యాపారి సానా సతీశ్ అరెస్టు

  • సతీశ్ ను అరెస్టు చేసిన ఈడీ 
  • పటియాలా కోర్టులో హాజరు పరిచిన అధికారులు
  • 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం

మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ మనీ ల్యాండరింగ్ కేసులో నిందితుడు, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారి సానా సతీశ్ బాబును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మనీలాండరింగ్ నియంత్రణ చట్టం ప్రకారం సతీశ్ ను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. సెంట్రల్ ఢిల్లీలోని కార్యాలయంలో నిన్న రాత్రంతా సతీశ్ ను ప్రశ్నించినట్టు సమాచారం. ఢిల్లీలోని పటియాలా కోర్టులో ఆయన్ని ఈరోజు మధ్యాహ్నం హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్టు కోర్టు పేర్కొంది.

కాగా, ఈ కేసు నుంచి మొయిన్ ఖురేషీని బయటకు తెచ్చేందుకు సీబీఐ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు ముడుపులు చెల్లించానని, రెండు కోట్లు లంచం అడిగారని సతీశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, రస్మా ఎస్టేట్స్, ఎల్ఎల్ పీ, గోల్డ్ కోస్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాట్రిక్స్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈస్ట్ గోదావరి బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఆర్ఏఎస్ మెరైన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలకు సతీష్ డైరెక్టర్‌గా ఉన్నారు. 

More Telugu News