Rajamouli: పూణే షెడ్యూల్ ను తమిళనాడుకి మార్చిన రాజమౌళి

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • తమిళనాడులో షూటింగు ప్లాన్ చేసిన రాజమౌళి
  •  35 రోజుల పాటు నాన్ స్టాప్ షూటింగ్    

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ గాయాల కారణంగా వాయిదా పడిన షూటింగు ఇటీవలే మళ్లీ మొదలైంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను పూణేలో ప్లాన్ చేశారు. అయితే అక్కడ షూటింగుకి సిద్ధమవుతున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం ఎదురవుతోందట.

దాంతో అక్కడ జరపవలసిన షెడ్యూల్ ను తమిళనాడులో చేయాలనే నిర్ణయానికి రాజమౌళి వచ్చినట్టుగా సమాచారం. తమిళనాడులో లొకేషన్స్ ను ఓకే చేసుకోవడం .. 35 రోజుల పాటు షూటింగు జరపడానికి అవసరమైన సన్నాహాలు చేసేయడం జరిగిపోయాయట. వచ్చేనెలలో ఎన్టీఆర్ - చరణ్ కాంబినేషన్లోని సీన్స్ ను వారం రోజుల పాటు తెరకెక్కిస్తారట. ఆ తరువాత ఎన్టీఆర్ పైనే ఎక్కువ సీన్స్ తీస్తారని తెలుస్తోంది. ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెరిగిపోతూనే వున్నాయి.

More Telugu News