Vijay Devarakonda: 'డియర్ కామ్రేడ్' తొలిరోజు వసూళ్లు

  • నిన్ననే విడుదలైన 'డియర్ కామ్రేడ్'
  • తొలి రోజు షేర్ 7.49 కోట్లు 
  • పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశం  

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' నిన్న థియేటర్స్ కి వచ్చింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన నటించింది. ఈ జోడీకి గల క్రేజ్ కారణంగా తొలి రోజునే ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 7.49 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తెలంగాణలో విజయ్ దేవరకొండ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందువలన ఒక్క నైజామ్ ఏరియాలోనే నిన్న ఒక్క రోజునే ఈ సినిమా 3 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేవారం వరకూ మరే సినిమా బరిలో లేకపోవడం, ఈ సినిమాకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

More Telugu News