Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హిందీలో తమన్నా మరో సినిమా 
  • స్విస్ వెళ్లనున్న 'డిస్కో రాజా' 
  • సంపూ సినిమా మళ్లీ వాయిదా   

*  అందాలభామ తమన్నా హిందీలో కూడా స్పీడు పెంచుతోంది. తమిళంలో వచ్చిన 'జిగార్తాండ' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ హిందీ రీమేక్ లో తమన్నాను హీరోయిన్ గా బుక్ చేసినట్టు తాజా సమాచారం.
*  రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిస్కో రాజా' తదుపరి షెడ్యూల్ షూటింగ్ వచ్చే నెల 4 నుంచి రెండు వారాల పాటు ఢిల్లీలో జరుగుతుంది. అనంతరం తదుపరి షెడ్యూలును స్విట్జర్లాండ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  కొన్నాళ్ల క్రితం ఒక్కసారిగా దూసుకొచ్చిన కామెడీ స్టార్ సంపూర్నేష్ బాబు కథానాయకుడుగా నటించిన 'కొబ్బరిమట్ట' చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. ఆగస్ట్ 2న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని కారణాంతరాల వల్ల ఆగస్ట్ 10కి వాయిదా వేశారు.

More Telugu News