కుమారస్వామి రాజీనామాను తట్టుకోలేక తోటను ధ్వంసం చేసుకున్న రైతు

Fri, Jul 26, 2019, 05:49 PM
  • ఎకరం పొలంలోని సర్వే తోటను నరికేశాడు
  • వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రైతు
  • రాజీనామా తనను ఎంత కుంగదీసిందో వివరణ 
సినీ నటులకు ఉన్నట్టే రాజకీయ నాయకులకు వీరాభిమానులు ఉంటారు. తమ నాయకుడికి ఏదైనా కష్టం వస్తే తమకే వచ్చినట్టుగా బాధపడుతుంటారు. కర్ణాటకలో కుమారస్వామి విషయంలోనూ ఇదే జరిగింది. విశ్వాస పరీక్షలో ఆయన ఓటమిని జీర్ణించుకోలేని ఓ రైతు చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది.

విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓటమిపాలై తన సీఎం పదవికి రాజీనామా చేయడాన్ని భరించలేని ఓ రైతు తన ఎకరం పొలంలోని సర్వే తోటను నరికేశాడు. అనంతరం దానిని వీడియో తీసి చూపిస్తూ, కుమారస్వామి రాజీనామా తనను ఎంతలా కుంగదీసిందో వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుమారస్వామి అభిమానులెవరూ ఇలాంటి నిర్ణయాలతో ఆయనను మరింత బాధ పెట్టవద్దని కొందరు అభిమానులు, నేతలు సూచిస్తున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha