Vijay Devarakonda: 'డియర్ కామ్రేడ్' రీమేక్ లో శ్రీదేవి తనయ

  • నేడు విడుదలైన 'డియర్ కామ్రేడ్'
  • హిందీ హక్కులు తీసుకున్న కరణ్ 
  • రీమేక్ లో 'దఢక్' జంట  

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా రూపొందిన 'డియర్ కామ్రేడ్' చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాను విడుదలకు ముందే చూసిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్ తనకీ చిత్రం బాగా నచ్చేసిందని చెప్పాడు. అంతేకాదు, దీనిని హిందీలో రీమేక్ చేస్తానంటూ హక్కుల్ని కూడా భారీ రేటుకి తీసుకున్నాడు.

అలాగే, ఈ చిత్రం రీమేక్ ద్వారా విజయ్ దేవరకొండని ఆయన హిందీకి పరిచయం చేయాలనుకున్నాడు. అయితే, తనకిప్పుడే హిందీలో నటించే ఆలోచన లేదంటూ ఆ ఆఫర్ ని విజయ్ సున్నితంగా తిరస్కరించాడు. దీంతో, ఆమధ్య తాను నిర్మించిన 'దఢక్' చిత్రంలో నటించిన ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ (శ్రీదేవి తనయ) జంటను కరణ్ ఈ రీమేక్ కు ఎంచుకున్నట్టు తాజా సమాచారం. త్వరలో పూర్తి వివరాలు తెలుస్తాయి.   

More Telugu News