cricket: రంజీ ట్రోఫీలో అవకాశం అంటూ డబ్బు వసూలు... క్రికెట్‌ అసిస్టెంట్‌ కోచ్‌ అరెస్టు

  • రంజీ ట్రోఫీలో ఆడిస్తానంటూ వసూళ్లు
  • సమాచారంతో బీసీసీఐ పోలీసులకు ఫిర్యాదు
  • అరెస్టు చేసిన ఢిల్లీ  క్రైం పోలీసులు

ఆట కంటే ఆమ్యామ్యాలతోనే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని శిష్యులను నమ్మించి డబ్బు గుంజుతున్న ఓ క్రికెట్‌ అసిస్టెంట్‌ కోచ్‌ చివరికి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. బాధితుల సమాచారంతో బీసీసీఐ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు.

 పోలీసుల కథనం మేరకు... ఢిల్లీకి చెందిన ఓ అసిస్టెంట్‌ కోచ్‌ వద్ద పలువురు శిక్షణ పొందుతున్నారు. అండర్‌-16, అండర్‌-19లో అవకాశాలు కల్పిస్తానని సదరు కోచ్‌ వీరిని నమ్మించడంతో వారంతా పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పారు. ఇలా డబ్బిచ్చిన వారిని ఆ తర్వాత కొన్నిమ్యాచ్‌ల్లో ఆడించినా, రంజీ జట్లలో అవకాశం మాత్రం రాలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఢిల్లీ క్రైం పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేశారు.

More Telugu News