teacher posts: ఉపాధ్యాయ ఖాళీలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వండి: తెలుగు రాష్ట్రాలకు ‘సుప్రీం’ ఆదేశం

  • లేదంటే ఇరు రాష్ట్రాల సీఎస్‌లు కోర్టు ముందు హాజరు కావాలి
  • ఖాళీ భర్తీపై ఎపెక్స్‌ కోర్టులో పిటిషన్‌
  • జస్టిస్‌ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ విచారణ

తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై మళ్లీ కదలిక వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని, లేదంటే ఇరు రాష్ట్రాల సీఎస్‌లు తమ ముందు హాజరు కావాలని ఎపెక్స్‌ కోర్టు ఆదేశించింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపడుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందే ఖాళీలపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ కోడ్‌ అమల్లో ఉన్నందున సాధ్యం కాదని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలియజేసి వాయిదా కోరాయి. తాజాగా ఈ పిటిషన్‌ మళ్లీ విచారణకు రావడంతో కోర్టు ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News