Death Sentence: ట్రంప్ సంచలన నిర్ణయం... మళ్లీ మరణశిక్షల అమలు!

  • మరణశిక్ష పడ్డ వారికి శిక్షల అమలు
  • తేదీలతో సహా ప్రకటించిన యూఎస్ ప్రభుత్వం
  • మీడియాకు వెల్లడించిన అటార్నీ జనరల్

సుమారు 20 సంవత్సరాల తరువాత అమెరికా మళ్లీ మరణశిక్షలను అమలు చేయనుంది. ఈ దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యంత కిరాతకమైన నేరాలకు పాల్పడిన వారికి మరణదండన అమలు చేయాల్సిందేనన్న ఫైల్ పై ఆయన సంతకం చేశారు. ప్రస్తుతం యూఎస్ లో ఐదుగురికి మరణశిక్ష విధించగా, వారికి శిక్షను ఎప్పుడు అమలు చేయాలన్న తేదీలను ఖరారు చేశారు. దీనిపై అమెరికా అటార్నీ జనరల్‌ విలియం బార్‌ ఓ ప్రకటన చేశారు.

 ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష అమలు చేయాలని న్యాయ శాఖ ఎప్పటి నుంచో కోరుతోందని గుర్తు చేశారు. బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయశాఖపై ఉందని, పెండింగ్ లోని మరణ శిక్షలను అమలు చేయాలంటూ జైళ్ల శాఖను ఇప్పటికే ఆదేశించామని ఆయన అన్నారు. అమెరికాలో పలు రాష్ట్రాలలో నేరస్థులకు విషపు (లెథల్) ఇంజక్షన్ ఇచ్చి మరణశిక్షను అమలు చేస్తారు.

More Telugu News