USA: ఓరి బుడుగో... ఎయిర్ పోర్టులో చిన్నారి చేసిన పని చూస్తే అవాక్కే... వీడియో!

  • అమెరికాలోని అట్లాంటాలో ఘటన
  • బిడ్డతో ఎయిర్ పోర్టుకు వచ్చిన తల్లి
  • బోర్డింగ్ పాస్ తీసుకుంటుంటే కన్వేయర్ బెల్ట్ ఎక్కిన చిన్నారి

చిన్న పిల్లలతో ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా లేకుంటే ఏం జరుగుతుందో తెలియజెప్పే వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. ఎయిర్ పోర్టుకు తన బిడ్డతో కలిసి వెళ్లిన ఓ యువతి, తన పనిలో తానుండగా, ఆ బుడతడు చేసిన పని అధికారులను కలవర పెట్టింది. అయితే, చురుకైన ఆ పిల్లాడు ప్రాణాపాయం లేకుండా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే, ఎడిత్‌ వెగా అనే మహిళ, విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లింది. కౌంటర్‌ వద్ద బోర్డింగ్‌ పాస్‌ తీసుకునే పనిలో ఆమె బిజీగా ఉండగా, నెమ్మదిగా ఆమెను విడిపించుకున్న బిడ్డ, సామగ్రి తనిఖీ చేసే కన్వేయర్ బెల్టుపై ఎక్కాడు. దీన్ని గమనించిన ఆమె, బాలుడిని ఆపేందుకు వచ్చినా, భద్రతా సిబ్బంది ఆమెను అనుమతించలేదు. దీంతో ఆమె వారికి పరిస్థితి వివరించింది. ఈలోగా బాలుడు బెల్టు పైకి ఎక్కి, స్కానింగ్ రూమ్ లోకి వెళ్లిపోయి బయటకు వచ్చాడు. బిడ్డను గమనించిన సిబ్బంది హడావుడిగా వెళ్లి, దాన్ని ఆపి బాలుడిని బయటకు తీశారు. ఈలోగా బాలుడికి స్వల్పగాయాలు అయ్యాయి. విమానాశ్రయంలోని పలు సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన ఆసాంతం రికార్డ్ కాగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

More Telugu News