BCCI: రవిశాస్త్రిని మారిస్తే జట్టు సమీకరణ దెబ్బతింటుంది: బీసీసీఐ సీనియర్ అధికారి

  • రవిశాస్త్రిని మారిస్తే జట్టు విజయాలపై ప్రభావం పడుతుంది
  • కోహ్లీ-రవిశాస్త్రి మధ్య మంచి అవగాహన ఉంది
  • వీరి జోడీని మారిస్తే జట్టు దెబ్బతింటుంది

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ప్రపంచకప్‌తో ముగిసింది. దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. ప్రధాన కోచ్ పదవికి శ్రీలంక మాజీ సారథి మహేల జయవర్ధనే, ఫీల్డింగ్ కోచ్ పదవికి దక్షిణాఫ్రికా స్టార్ ఫీల్డర్ జాంటీరోడ్స్ దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, తాజాగా ఇప్పుడు ఆ దరఖాస్తులను పక్కనపెట్టేయాలని బీసీసీఐ చూచాయగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చేసిన ప్రకటన ఇందుకు ఊతమిస్తోంది.

కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ముుందుకు సాగుతున్నారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. వీరి జోడీని మార్చడం వల్ల జట్టు విజయాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. కోచ్ రవిశాస్త్రిని మారిస్తే జట్టు సమీకరణలు దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2020లో జరగనున్న టీ20 ప్రపంచకప్, 2023 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని రవిశాస్త్రిని మార్చకపోవడమే మంచిదని ఆయన పేర్కొన్నారు.

More Telugu News