వీరికి నేను పోటీ ఏంటి, నా పిచ్చి కాకపోతే!: యాంకర్ అనసూయ

25-07-2019 Thu 17:30
  • నా సినిమాతో పాటు ‘మన్మథుడు 2’ చూస్తా
  • మన్మథుడు ట్రైలర్ చాలా బాగుంది
  • నాకిష్టమైన వారంతా సినిమాలో ఉన్నారు
యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజున అక్కినేని నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’ కూడా విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ నేడు విడుదలైంది.

అయితే తన సినిమా విడుదల రోజే నాగ్ సినిమా కూడా విడుదల కాబోతోందన్న విషయం తెలుసుకున్న అనసూయ ఓ ట్వీట్ చేసింది. ‘అసలు వీరికి నేను పోటీ ఏంటి? నా పిచ్చి కాకపోతే’ అని పేర్కొంది. అంతే కాదు, తాను తన సినిమాతో పాటు ‘మన్మథుడు 2’ కూడా చూస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మన్మథుడు ట్రైలర్ చాలా బాగుందని, తనకిష్టమైన నాగార్జున, రకుల్ ప్రీత్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్ సినిమాలో ఉన్నారని తెలిపింది.