Bellamkonda Srinivas: 'రాక్షసుడు'లో టీచర్ గా కనిపిస్తాను: అనుపమా పరమేశ్వరన్

  • తమిళంలో హిట్ అయిన 'రాచ్చసన్'
  • తెలుగులో 'రాక్షసుడు'గా రీమేక్ 
  • వచ్చేనెల 2వ తేదీన విడుదల 

బెల్లంకొండ శ్రీనివాస్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అయితే, ఇటీవల వచ్చిన ఆయన సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాలను అందించలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన 'రాక్షసుడు' సినిమా చేశాడు. తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్'కి ఇది రీమేక్. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను వచ్చేనెల 2వ తేదీన విడుదల చేయనున్నారు. తాజా ఇంటర్యూలో అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ, "ఈ సినిమాలో నేను టీచర్ పాత్రలో కనిపిస్తాను. ఈ తరహా పాత్రను చేయడం ఇదే మొదటిసారి. ఈ పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. తమిళంలో అమలా పాల్ చేసిన పాత్రను తెలుగులో నేను చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా నా కెరియర్ కి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.

More Telugu News