Nagarjuna: హీరో పెళ్లి చుట్టూ తిరిగే కథే 'మన్మథుడు 2': నాగార్జున

  • ఇది ఒక ఫ్రెంచ్ మూవీకి రీమేక్ 
  • 'మన్మథుడు' పాత్రను స్ఫూర్తిగా తీసుకున్నాం
  • కావలసినంత కామెడీ ఉంటుందన్న నాగ్   

నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' చిత్రం రూపొందింది. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, వచ్చేనెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి.

తాజా ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ .. "ఇది ఒక ఫ్రెంచ్ హిట్ సినిమాకి రీమేక్. ఆ నిర్మాతల నుంచి రైట్స్ తీసుకుని ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇది 'మన్మథుడు' సినిమాకి సీక్వెల్ కాదు .. ఆ సినిమాలోని పాత్రను స్ఫూర్తిగా తీసుకోవడం జరిగిందంతే. పోర్చుగల్ లో మూడు తరాల క్రితం స్థిరపడిన భారతీయ కుటుంబం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. వయసు ముదిరిన హీరో పెళ్లి చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఆ విషయంపైనే కావాల్సినంత కామెడీ నడుస్తుంది. తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News