Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. ఆగ్రహంతో వాకౌట్ చేసిన చంద్రబాబు!

  • సీఎం జగన్ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యుల నినాదాలు
  • అశోక్, గణేశ్, రామకృష్ణబాబు, వీరాంజనేయులు సస్పెన్షన్ 
  • సభలో మాట్లాడనివ్వడం లేదని చంద్రబాబు ఆగ్రహం

ఏపీ-తెలంగాణల మధ్య నదీ జలాల పంపిణీతో పాటు కౌలు రైతులకు రుణాలకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో ఈరోజు వాడీవేడి చర్చ సాగింది.  ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను తాము తాకట్టు పెట్టబోమని స్పష్టం చేశారు. కౌలు రైతులకు రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, అందుకే బిల్లును తీసుకొచ్చామని చెప్పారు. భూ యజమానులకు నష్టం జరగకుండానే కౌలు రైతులకు న్యాయం చేస్తామన్నారు.  

ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు ఉమ్మడి నదీ జలాల పంపిణీపై ఆందోళనకు దిగారు. ఏపీకి అన్యాయం చేయొద్దని నినాదాలు ఇచ్చారు. ఇలా సభకు అంతరాయం కలగడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ టీడీపీ ఎమ్మెల్యేలు అశోక్ బెందాళం, వాసుపల్లి గణేశ్, వెలగపూడి రామకృష్ణబాబు, డోలా బాలవీరాంజనేయులును సభ నుంచి ఒక రోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో అసెంబ్లీలో తమ గొంతుకను వినిపించే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

More Telugu News