TIKTOK: ‘టిక్ టాక్’ యాప్ లో పాటకు చిందేసిన మహిళా పోలీస్.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు!

  • గుజరాత్ లోని మెహసానా జిల్లాలో ఘటన
  • టిక్ టాక్ వీడియోకు నర్తించిన అర్పితా చౌదరి
  • క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు డీఎస్పీ వెల్లడి 

చిన్నాపెద్దా, వాళ్లువీళ్లు అనే తేడా లేకుండా అందరూ ‘టిక్ టాక్’ యాప్ ను తెగ వాడేస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులో టిక్ టాక్ వీడియోలు చేసి, క్రమశిక్షణా చర్యలకు గురైన సంఘటన మర్చిపోకముందే మరో ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. గుజరాత్ లోని  మెహసానా జిల్లా లంఘ్ నాజ్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అర్పితా చౌదరి టిక్ టాక్ యాప్ ద్వారా ‘యే జవానీ హై దివానీ’ సినిమాలోని ఓ పాటకు చిందేసింది.

అక్కడితో ఆగకుండా దాన్ని వాట్సాప్ లో అందరికీ షేర్ చేసింది. చివరికి ఈ విషయం జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విధినిర్వహణలో టిక్ టాక్ వీడియోలు ఏంటని సీరియస్ అయ్యారు. ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఉండి యూనిఫాం ధరించకుండా టిక్ టాక్ వీడియోలు చేయడంపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు డీఎస్పీ మంజితా వంజరా తెలిపారు.

More Telugu News