Balakrishna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బాలకృష్ణకు హీరోయిన్లు ఖరారు
  • క్రికెటర్ పాత్రలో ప్రముఖ నటుడు
  • సుదీప్ 'పహిల్వాన్' విడుదల తేదీ 

*  బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందే చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిత్రంలో హీరోయిన్లుగా 'లెజండ్' ఫేం సోనాల్ చౌహాన్ ను రెండు రోజుల క్రితం ఎంపిక చేయగా, తాజాగా వేదికను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.
*  తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచ క్రికెట్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీ ధరన్ జీవితకథను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో మురళీ ధరన్ పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటించనున్నాడు.
*  'ఈగ' సుదీప్ హీరోగా నటించిన 'పహిల్వాన్' చిత్రం విడుదలను వాయిదా వేశారు. కన్నడ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న విడుదల చేయడానికి తాజాగా నిర్ణయించారు.

More Telugu News