Whatsapp: మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్

  • ఫోటోలు, వీడియోలను సేవ్ చేసే అవకాశం
  • ఫైల్ మేనేజర్‌పై ఈ సదుపాయం ఆధారపడి ఉంటుంది
  • సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాలి

వాట్సాప్ యాజమాన్యం తన వినియోగదారులకు మరో అద్భుత అవకాశాన్ని కల్పించింది. ఇప్పటి వరకూ వాట్సాప్ స్టేటస్‌లో మనకు నచ్చిన ఫోటోలు, వీడియోలను సేవ్ చేసే అవకాశం లేదు. తాజాగా వాట్సాప్ ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకున్న మీదటే మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ సూచించింది. అయితే ఈ సేవ్ చేసుకునే సదుపాయం ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఫైల్ మేనేజర్‌పై ఆధారపడి ఉంటుంది.

స్టేటస్‌ను దాచుకునేందుకు మొదట ఫైల్ మేనేజర్‌లోకి వెళ్లి, పై భాగంలో ఎడమవైపు ఉన్న హ్యాంబర్గర్‌ ఐకాన్ మీద క్లిక్ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం ‘షో హిడెన్‌ ఫైల్స్‌’ ను ఎనేబుల్ చేయాలి. ఇక మనకు కావాల్సిన ఫోటో లేక వీడియోను సేవ్ చేసేందుకు దానిపై లాంగ్ ప్రెస్ చేసి, కాపీ చేసి మన ఫోన్‌లోని ఇంటర్నల్ మెమొరీలో మనకు నచ్చిన ఫోల్డర్‌లో దాన్ని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది.

More Telugu News