Jammu And Kashmir: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు!

  • ఏప్రిల్‌లోనే ఈసీకి నోట్ పంపిన కేంద్రం
  • సరైన సమాచారంతో తిరిగి పంపాలన్న ఈసీ
  • కేంద్ర న్యాయశాఖ, హోంశాఖలు గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్, సిక్కింలో అసెంబ్లీ సీట్ల పెంపునకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరగా.. ఈసీ ఆ వివరాలను వెల్లడించింది. అసెంబ్లీ సీట్ల పెంపుపై ఏప్రిల్‌లోనే ఈసీకి కేంద్ర ప్రభుత్వం నోట్‌ పంపింది. అయితే కేంద్రం పంపిన నోట్‌ సరిగా లేదంటూ.. సరైన సమాచారంతో మరోసారి పంపాలని హోంశాఖను ఈసీ కోరింది.

  అసెంబ్లీ సీట్ల పెంపుపై ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ, హోంశాఖలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తాజాగా పునర్విభజనకు సంబంధించి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒక కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా సీట్ల సంఖ్య ఏపీలో 225, తెలంగాణలో 151కి చేరుకోనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.

More Telugu News