nagarjuna: భారీ రేటుకు 'మన్మథుడు 2' శాటిలైట్ హక్కులు

  • 'మన్మథుడు 2'పై పెరుగుతోన్న ఆసక్తి 
  • ఈ వయసులోను రొమాంటిక్ హీరోగా నాగ్ 
  • క్రేజ్ కి తగినట్టుగా పెరుగుతోన్న బిజినెస్  

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా 'మన్మథుడు 2' సినిమా రూపొందింది. రకుల్ .. కీర్తి సురేశ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 9వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి.

దాంతో సహజంగానే ఈ సినిమా బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వారు 7.4 కోట్లకు దక్కించుకున్నారు. హిందీ అనువాద హక్కులు 6 కోట్లకి పైగా అమ్ముడయ్యాయని సమాచారం. ఇక తాజాగా శాటిలైట్ హక్కులను 'స్టార్ మా' టీవీ వారు 8.3 కోట్లకి సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ వయసులోను రొమాంటిక్ హీరోగా రంగంలోకి దిగిన నాగ్, అభిమానులను ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి మరి.

More Telugu News