Madhya Pradesh: మోదీ, షా ఆదేశిస్తే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలు కూడా నిలవదు!: బీజేపీ నేత గోపాల్ భార్గవ్

  • కర్ణాటకలో కూలిన కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం
  • ఇప్పుడు ఉత్తరాదిపై దృష్టి పెట్టిన బీజేపీ
  • కీలక వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం నిన్న కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై కూడా దృష్టి సారిస్తుందని వార్తలు వస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ భార్గవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీలోని నంబర్ 1(ప్రధాని మోదీ) నంబర్ 2( హోంమంత్రి అమిత్ షా) నుంచి ఆదేశాలు వస్తే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 24 గంటలు కూడా మనుగడ సాగించలేదని హెచ్చరించారు. కాగా, ఈ హెచ్చరికలపై సీఎం కమల్ నాథ్, ఇతర కాంగ్రెస్ నేతలు ఇంతవరకూ స్పందించలేదు.

More Telugu News